News July 20, 2024

నిజామాబాద్: GGHలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతం

image

నిజామాబాద్ GGHలో కిడ్నాప్ అయిన మూడేళ్ల బాలుడు అరుణ్ కథ సుఖాంతం అయ్యింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో బాలుడిని పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే అతణ్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఆర్మూర్‌కు చెందిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. కాగా జిల్లా ఆస్పత్రిలో తన తండ్రి పక్కన నిద్రిస్తున్న బాలుడిని ఇద్దరు నిందితులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.

Similar News

News February 13, 2026

NZB: కొన్ని గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

image

నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. మొత్తం 4,95,485 మంది ఓటర్లకు గాను 3,06,697 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల జయాపజయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. గెలుపు ధీమాతో ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కల్లో మునిగిపోయారు.

News February 13, 2026

NZB: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

image

రాష్ట్రస్థాయి సీఎం కప్ విలువిద్య పోటీలకు గురువారం నిజామాబాద్‌లో ఖేలో ఇండియా విలువిద్య శిక్షణ కేంద్రం రాజారాం స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు ఖమ్మంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొంటారు. కాంపౌండ్, రికవ్ ఇండియన్ రౌండ్ విభాగాల్లో ఎంపికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విలువిద్య శిక్షకులు మురళి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.