News March 26, 2025
నిజామాబాద్ POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18 ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. నిజామాబాద్ డీసీసీ చీఫ్‌గా మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి వెళ్లారు. ఆయనకు ఇటీవల రాష్ట్ర సహకార యూనియన్ ఛైర్మన్‌ను అప్పగించారు.
Similar News
News March 29, 2025
NZB: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.
News March 29, 2025
NZB: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీపీ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య పోలీస్ శాఖ తరఫున విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజలందరూ ఎలాంటి అభద్రతాభావంతో లేకుండా సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ప్రజలు శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
News March 29, 2025
NZB: మీ సేవ సర్వర్ డౌన్‌తో ఇబ్బందులు

మీ సేవ సెంటర్లలో శనివారం సర్వర్ డౌన్ ప్రాబ్లమ్ ఎదురైంది. దీనితో మీ సేవ సెంటర్లకు వెళ్లిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా సర్వర్ డౌన్ చూపగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సెంటర్లలో పడిగాపులు కాశారు. కాగా రాజీవ్ యువ వికాస పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అధిక సంఖ్యలో అభ్యర్థులు రావడంతో ఈ ఇక్కట్లు అని తెలిసింది.