News October 5, 2025
నిజామాబాద్: SRSP గోదావరిలో ఒకరి గల్లంతు

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్పెల్ వే గేట్ల వద్ద అనిల్ అనే వ్యక్తి గల్లంతయ్యాడని మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మెండోరా మండలం పోచంపాడ్లో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన ఆనంద్, అనిల్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద చేపలు పట్టడానికి వెళ్లి స్పిల్ వే గేట్ల వద్ద గల్లంతైనట్లు చెప్పారు.
Similar News
News October 5, 2025
SRSP UPDATE: 11 గేట్ల మూసివేత

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. 11 గేట్లు మూసివేసి 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఆదివారం రాత్రి ఔట్ ఫ్లోగా 1,09,790 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1,090.9 (80.053 TMC) అడుగుల నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
News October 5, 2025
NZB: ఎస్ఎస్సీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు: డీఈఓ

పదో తరగతి విద్యార్థుల కోసం సోమవారం నుంచి ఒక గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఈఓ అశోక్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు బోర్డు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా ప్రత్యేక తరగతులను తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. జడ్పీ, ప్రభుత్వ పాఠశాలలు, టీజీఎంఎస్, కేజీబీవీల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్లు, స్పెషల్ ఆఫీసర్లు అందరూ ఈ ఆదేశాలు పాటించాలన్నారు.
News October 5, 2025
నవీపేట్: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య

నవీపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. తడుగాం గ్రామానికి చెందిన రాజయ్య(39) అప్పుల బాధ తాళలేక సూసైడ్ చేసుకున్నాడు. ఎస్సై తిరుపతి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజయ్య గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. కొన్ని రోజులు ఏం పని చేయకపోవటంతో అప్పులు పెరిగిపోయాయి. దీంతో రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తల్లి, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.