News March 11, 2025
నిజామాబాద్: TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ టి.గంగారం(55) ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన స్వస్థలం కోటగిరి మండలం సిద్దులం. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సిరిసిల్లలోని ఓ భవనంలో ఆయన లిఫ్ట్ యాక్సిడెంట్‌కు గురై మృతి చెందారని బెటాలియన్ వర్గాలు తెలిపాయి. ఆయన మృతి పట్ల బెటాలియన్ అధికారులు, సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 12, 2025
ఆరె కటికల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ మద్దతు: TPCC చీఫ్

ఆరె కటికల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం రాత్రి రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక మహాసభలో మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ఆరె కటికలు రాజకీయంగా ఎదిగి ఎమ్మెల్యేలుగా మారే స్థాయికి రావాలని ఆకాంక్షించారు. బీసీలకు కాంగ్రెస్ పాలనలోనే సువర్ణ యుగమని, బీసీలు సంఘటితం అయితే భవిష్యత్ తెలంగాణ బీసీలదే అని పేర్కొన్నారు.
News March 12, 2025
NZB: SSC పరీక్షల నిర్వాణపై డీఈఓ పరిచయ కార్యక్రమం

రానున్న SSC పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సన్నద్ధత సహా పలు కీలక అంశాలపై జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్‌తో బుధవారం ఉదయం 7:50 నిమిషాలకు ఆకాశవాణి నిజామాబాద్ (103.2 M.Htz) లేదా “News On AIR” మొబైల్ యాప్ ద్వారా ప్రసారం కానుందని అధికారులు తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్ర ఉద్దేశాన్ని అవగాహన చేసుకొని తగు సూచనలు ఇవ్వాలని డీఈవో అశోక్ కోరారు.
News March 12, 2025
NZB: ఇంటర్ పరీక్షలు.. 852 మంది గైర్హాజరు, ఒకరిపై మాల్ ప్రాక్టీసు కేసు

నిజామాబాద్ జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం బాటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్-1ఏ పరీక్షకు 852 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 21,218 మంది విద్యార్థులకు గాను 20,366 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. కాగా, డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి చీటీలు పెట్టి పరీక్ష రాస్తుండగా పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామన్నారు.