News July 26, 2024
నిజామాబాద్: TODAY NEWS HEADLINES

* బాన్సువాడ, ఎల్లారెడ్డిలో CM రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
* SRSP పునాదికి 60 ఏళ్లు అధికారుల సంబరాలు
* ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదం ఒకరు దుర్మరణం
* పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి: కలెక్టర్ రాజీవ్ గాంధీ
* బడ్జెట్లో KMR జిల్లాకు అన్యాయం: BJP జిల్లా అధ్యక్షురాలు అరుణ తార
* నిజామాబాద్ రైల్వే స్టేషన్లో రూ. 50 లక్షలు పట్టివేత
* SRSP కు వరద తాకిడి. నిజాంసాగర్‌కు స్వల్ప ఇన్ ఫ్లో
Similar News
News January 23, 2026
NZB: అండమాన్‌కు అజాద్ హిందూ పేరు పెట్టాలని కవిత లేఖ

అండమాన్‌కు అజాద్ హిందూ పేరు పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి NZB మాజీ MP, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ రాశారు. జాగృతి కూడా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ల డిమాండ్‌ను సపోర్ట్ చేస్తోందన్నారు. తమకున్న నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ వచ్చేలా చేస్తామని లేఖలో పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ పేరును బ్రిటీష్ వాళ్లు పెట్టారన్నారు.
News January 23, 2026
NZB: హై-టెక్ నైపుణ్యాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పం: సుదర్శన్

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు హై-టెక్ నైపుణ్యాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన స్కిల్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ ప్రోగ్రాంలో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
News January 23, 2026
NZB: మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ కసరత్తు

మేయర్ పదవీ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో నిజామాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, BJP తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. తమదే మేయర్ పీఠం అంటూ ఇరు పార్టీల నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ ముందే పూర్తిస్థాయిలో BJP, కాంగ్రెస్ హడావుడి మొదలైంది. కాంగ్రెస్ నుంచి సుమారు 700, బీజేపీ నుంచి 500 వరకు ఆశావహులు టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవడంతో గెలిచే వారి కోసం సర్వేలు చేపట్టారు.


