News February 14, 2026

నిజాయతీకి నిలువుటద్దం!

image

నేడు దామోదరం సంజీవయ్య 105వ జయంతి. కర్నూలు జిల్లా పెద్దపాడులో జన్మించిన ఆయన అతి పిన్న వయసులో (38 ఏళ్లు) ఉమ్మడి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. తొలి దళిత సీఎంగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా ఆయన సేవలు చిరస్మరణీయం. ఏసీబీ వ్యవస్థ స్థాపన, భూ పంపిణీ వంటి విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి అందరికీ అజాతశత్రువుగా పేరొందారు. పదవులు అనుభవించినా సొంత ఇల్లు కూడా లేని ఆయన నిరాడంబరత నేటి తరానికి స్ఫూర్తిదాయకం.

Similar News

News February 14, 2026

ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక.. బందోబస్తుపై సమీక్ష

image

MHBD మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. శనివారం టౌన్ CI మహేందర్ రెడ్డితో కలిసి DSP, RDO, కమిషనర్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈనెల 16న జరిగే ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని DSP ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

News February 14, 2026

పుదుచ్చేరి ఓటర్ల జాబితా విడుదల: మహిళా ఓటర్ల ఎక్కువ!

image

పుదుచ్చేరి రాష్ట్ర ఎన్నికల శాఖ తాజాగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి: ​మొత్తం ఓటర్లు: 9,44,211, ​పురుషులు: 4,43,595, ​మహిళలు: 5,00,477, ​తృతీయ ప్రకృతి (ట్రాన్స్‌జెండర్స్): 139. ​పుదుచ్చేరి, కారైకాల్, మాహే, యానాం ప్రాంతాల్లోని మొత్తం 30 నియోజకవర్గాలకు సంబంధించిన గణాంకాలివి. పురుషుల కంటే మహిళా ఓటర్లే 56,882 ఎక్కువుండం విశేషం.

News February 14, 2026

జమాత్ గెలుపు… భారత్‌కు సమస్యేనా!

image

బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఇండియాను ఆనుకొని ఉన్న సరిహద్దు సీట్లలో పాక్ అనుకూల ‘జమాత్-ఏ-ఇస్లామీ’ గెలవడం ఆందోళనకరమని రిపబ్లిక్ TV వ్యాఖ్యానించింది. అది 68 స్థానాలు గెలవగా మన దేశ సరిహద్దు వెంబడి ఉన్న దాదాపు అన్ని సీట్లు ఆ పార్టీ ఖాతాలో ఉన్నాయంది. చికెన్ నెక్ కారిడార్‌, WB, మేఘాలయ, త్రిపుర, అస్సాంను ఆనుకొని ఉన్న సీట్లలో గెలిచిన జమాత్ భారత్‌ వ్యతిరేక రాడికలైజేషన్‌ను పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.