News August 10, 2025

నిడదవోలులో డెడ్ బాడీ కలకలం

image

నిడదవోలు గణేష్ సెంటర్‌లో జీవీ మాల్ ఎదురుగా ఓ వ్యక్తి మృతదేహం ఆదివారం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. డెడ్ బాడీని పరిశీలించారు. మృతుడి వయస్సు 55 ఏళ్లు ఉంటాయని, ఆర్టీసీ బస్సు టికెట్‌తో పాటు కంటి ఆసుపత్రి అడ్రస్సు ఉన్నాయని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. వివరాలు తెలిసిన వారు 94407 96659 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News August 11, 2025

కొవ్వూరులో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం

image

జాతీయ భావజాలాన్ని ప్రజల్లో పెంపొందిస్తూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంలో బీజేపీ పార్టీ నిబద్ధతతో పనిచేస్తుందని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నాగేంద్ర అన్నారు. ఆదివారం కొవ్వూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రతి పౌరుడు దేశభక్తిని పెంపొందించే విధంగా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని సూచించారు.

News August 10, 2025

రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేయాలి: మాజీ ఎంపీ భరత్

image

సర్దార్ పాపన్న గౌడ్‌ను స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్ధార్ పాపన్నగౌడ్ 375వ జయంతి సందర్భంగా జై గౌడ్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో జాతీయ వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న భరత్ మాట్లాడుతూ..బీసీ రిజర్వేషన్ సాధించే దిశగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News August 10, 2025

తూ.గో: రేపు యథావిధిగా పీజీఆర్ఎస్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీలు అందజేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని, వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన కలిగి ఉండాలని ఆమె ఆదేశించారు.