News October 3, 2024

నిడదవోలులో రేపు జాబ్ మేళా

image

నిడదవోలు ఎస్వీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తూ.గో.జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధాకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు జాబ్ మేళా మొదలవుతుందని, 5 కంపెనీల ప్రతినిధులు ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. SSC, డిప్లొమా, డీఫార్మసీ, ఇంటర్, డిగ్రీ, బీ-ఫార్మసీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఎంసీఏ ఎం-ఫార్మసీ చదివిన 19-30 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులన్నారు.

Similar News

News August 21, 2025

భోజనం రుచిగా ఉండాలి: కలెక్టర్

image

రాజమండ్రిలోని అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్, కమిషనర్ పి. ప్రశాంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె అక్కడికి వచ్చిన ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆహార నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని, భోజనం రుచిగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. మెనూ ప్రకారం భోజన పదార్థాలు ఉండేలా చూడాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులను, సిబ్బందిని ఆదేశించారు.

News August 21, 2025

రాజమండ్రి: ఈవీఎంల గోడౌన్‌ తనిఖీ

image

సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పరిశీలించారు. గురువారం ఎఫ్‌సీఐ గోడౌన్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ పి. ప్రశాంతి, ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, తహశీల్దార్ పాపారావు, ఇతర రెవెన్యూ సిబ్బంది పోలీసులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ప్రతి నెలా ఈవీఎంల గోడౌన్లను తనిఖీ చేస్తామని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు.

News August 21, 2025

రాజమండ్రి: 106 కుటుంబాలకు పునరావాస కేంద్రంలో ఆశ్రయం

image

గోదావరి వరదల కారణంగా రాజమండ్రిలోని ఏసీ గార్డెన్స్ ఎంపీఎల్ కళ్యాణ మండపంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం తెలిపారు. మొత్తం 106 కుటుంబాలకు ఆశ్రయం కల్పించామని వారిలో పురుషులు 110, మహిళలు 111, పిల్లలు 72 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఆర్డీవో, తహశీల్దార్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుందన్నారు.