News January 20, 2025
నిడదవోలు విద్యార్థి విజయనగరంలో ఆత్మహత్య

ఉమ్మడి ప.గో జిల్లా నిడదవోలుకు చెందిన MBBS వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్ ఆదివారం నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ సభ్యుల వేదనకు తానే కారణమవుతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News October 28, 2025
రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్

మొంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు, పాఠశాలలకు, అంగన్వాడీలకు కలెక్టర్ చదలవాడ నాగరాణి సెలవు ప్రకటించారు. ఉత్తర్వులను అన్ని విద్యాసంస్థలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. పిల్లలు బయట తిరగనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు.
News October 28, 2025
ప.గో జిల్లాలో 583.8 మి.మీ. వర్షపాతం

గడిచిన 24 గంటల్లో జిల్లాలో 583.8 మి.మీల వర్షపాత నమోదు అయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సరాసరి 29.2 మి.మీ కాగా అత్యధికంగా యలమంచలిలో 53.6, నరసాపురంలో 49.6, పాలకొల్లులో 49.2, ఆచంటలో 43.8, మొగల్తూరులో 42.4 మి.మీలు నమోదయింది. అత్యల్పంగా గణపవరం 13.6 మి.మీ, తాడేపల్లిగూడెం 14.0, అత్తిలిలో 16.6 మి. మీ నమోదు అయినట్టు అధికారులు తెలిపారు.
News October 28, 2025
తణుకు: ఇద్దరు డీఎస్పీలు ఒక్కటయ్యారు

ప.గో జిల్లా తణుకులో ఇద్దరు DSPల వివాహ మహోత్సవం జరిగింది. గతంలో చందోలు PSలో ట్రైనింగ్ డీఎస్పీగా విధులు నిర్వహించి, ప్రస్తుతం కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీగా పనిచేస్తున్న విద్యశ్రీ(స్వగ్రామం ప.గో(D) పాలంగి), పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీగా పనిచేస్తున్న జగదీష్ వివాహ వేడుక ఆదివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. పోలీసు శాఖలో ఒకే క్యాడర్‌లో ఉన్న అధికారులు ప్రేమ వివాహం చేసుకోవడం విశేషం.


