News March 5, 2025

నిడమర్రు: ఆక్వా రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక ఆక్వా రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిడమర్రు(M) గుణపర్రులో జరిగింది. గ్రామంలో రొయ్యలు చెరువు సాగు చేస్తున్న నిమ్మల శ్రీను సుమారు రూ.కోటి మేర నష్టపోయాడు. అప్పులు తీర్చలేనని మనోవేదనకు గురై విషం తాగాడు. ఆ తర్వాత సోదరుడికి ఫోన్ చేయడంతో బంధువులు గాలించి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News January 8, 2026

ప.గో: యువకుడి ఆత్మహత్య

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ఉండిలో చోటుచేసుంది. ఉండి శివారు ఉప్పగుంట వద్ద చేపల చెరువు వద్ద పనిచేస్తున్న దీప్ జ్యోతి బాస్మతి (21) చెరువు గట్టు మీద ఉన్న రేకుల షెడ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా మృతుడు తన తండ్రి సుకుమార్‌తో కలిసి ఉండిలో ఓ చేపలచెరువు వద్ద పనిచేస్తున్నాడు. మృతుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు SI నసీరుల్లా తెలిపారు.

News January 8, 2026

నేడు భీమవరంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు

image

భీమవరం డీఎన్ఆర్ స్వయం ప్రతిపత్తి కళాశాలలో గురువారం ప్రభుత్వ ఉద్యోగుల శాఖాపరమైన అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ పరీక్షకు సుమారు 100 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ఏర్పాటు చేయాలని సూచించారు.