News August 27, 2025
నిడిగొండలో చారిత్రక కాంతులు..!

జిల్లాలోని రఘునాథపల్లి మండలం నిడిగొండ చారిత్రక, ఆధ్యాత్మిక చిహ్నాల సంపన్న గ్రామం. అనేక శిల్పాలు, శాసనాలు ఘనమైన వారసత్వ సంపద కలిగిన గ్రామం. ఈ గ్రామంలో నేటి వరకు 10 గణపతి మూర్తులను మనం దర్శించవచ్చు. మరికొన్ని దొరికే అవకాశాలు ఉన్నాయి. ఈ శిల్పాలు చక్కని రూప లావణ్యంతో, శిల్ప కళా విశేషాలతో కూడియున్నవి. ఇందులో రాష్ట్రకూట, చాళుక్య, కాకతీయ, కాకతీయ అనంతర కాలంలోనివి. మన వారసత్వానికి ప్రతీకలు.
Similar News
News August 27, 2025
HYD: 20 నిమిసాల్లో భార్యను ముక్కలుగా చేశాడు!

మేడిపల్లి స్వాతి దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మహేందర్ రెడ్డి తన భార్య స్వాతి మృతదేహాన్ని 20 నిమిషాల్లోనే ముక్కలు చేసి మూసీ నదిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. గత 4 రోజులుగా DRF బృందాలు ఆమె శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
News August 27, 2025
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు పట్టిష్ఠ చర్యలు: కలెక్టర్

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. పంచాయతీ శాఖపై సమీక్షలో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయడం, కోర్టు కేసులకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడం, అక్రమ నిర్మాణాలపై పర్యవేక్షణ, ఓటర్ లిస్ట్ అప్‌డేట్ చేయడం వంటి అంశాలపై డాక్యుమెంట్ ఇవ్వాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి, డీపీఎల్ఓలు, ఎంపీఎల్ఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News August 27, 2025
జిల్లాలో ముగిసిన ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ

సంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ పూర్తయిందని డీఈఓ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. 40 మంది స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా, 190 మంది ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి లభించిందన్నారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులందరూ వెంటనే నూతన పాఠశాలల్లో చేరాలని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.