News October 16, 2025
నిడిగొండలో భృంగి నాట్య వినోద శిల్పం

రఘునాథపల్లి(M) నిడిగొండ గ్రామ శివాలయ గోపురంపై అరుదైన భృంగి నాట్య శిల్పం ఆకట్టుకుంటోంది. శివుడి ద్వారపాలకులలో ఒకరైన భృంగి నాట్యం చేస్తుండగా, పక్కనే ఇద్దరు వాయిద్యాలు వాయిస్తున్న దృశ్యాన్ని అద్భుతంగా చెక్కారు. ఇవి కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తాయి. ఆలయ గోపురంపై ఈ శిల్పం ఉండటం గ్రామ చరిత్రకు ప్రత్యేక గుర్తింపునిస్తోంది. అదే గోపురంపై ధ్యానముగ్ధులైన యోగులు, భక్తుల శిల్పాలు కూడా ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Similar News
News October 17, 2025
పిల్లలు చదవట్లేదా?

సాధారణంగా చాలామంది పిల్లలు చదువంటే ఆసక్తి చూపరు. ఆటలమీదే మనసు ఉంటుంది. కొన్నిసార్లు ఇది మానసిక సమస్యకు సంకేతం అంటున్నారు నిపుణులు. బార్డర్‌లైన్ ఇంటిలిజెన్స్, స్పెసిఫిక్ లర్నింగ్ డిజెబిలిటి, ADHD వంటి సమస్యలుంటే పాఠాలు అర్థంకాకపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలుంటాయి. వీటిని గుర్తిస్తే చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లండి. చదువంటే భయం తగ్గి ఆసక్తి కలిగే పద్ధతులు నేర్పిస్తారు.
News October 17, 2025
యాదాద్రి: నూతన భవనం పైనుంచి పడి దుర్మరణం

కొత్తగా నిర్మిస్తున్న ఇంటి స్లాబ్‌కు నీరు పడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన భూదాన్ పోచంపల్లి(M) పెద్దగూడెంలో జరిగింది. గ్రామానికి చెందిన పారిపల్లి కృష్ణారెడ్డి(53) తన ఇంటి నిర్మాణంలో భాగంగా స్లాబ్‌కు నీరు పోస్తుండగా కాలుజారి కింద పడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందారు. భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ భాస్కర్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.
News October 17, 2025
సమ్మె విరమించాల్సిందే!

AP: సమ్మె విరమించాలని, లేకపోతే చర్యలు తప్పవని PHC వైద్యులను వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరణతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి గత నెల 30 నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఉన్నతాధికారులు చర్చలు జరిపినా సఫలం కాలేదు. ఎస్మా సైతం ప్రయోగిస్తామని చెప్పినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. తాజాగా నోటీస్-3 జారీ చేయగా, PHC వైద్యులు ఏం విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.