News March 11, 2025

నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి భేటీ

image

మంత్రి KVR ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాలపై ఆయనతో సమగ్ర చర్చలు జరిపారు. టెన్నాలీ-HYD ఎక్స్‌ప్రెస్ హైవే, WGL – KMM జాతీయ రహదారి విస్తరణ, HYD రింగ్ రోడ్డు విస్తరణ అంశాలపై KVR గడ్కరీతో ప్రస్తావించారు. TGలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారి ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరారు.

Similar News

News February 13, 2026

​మూడు కార్పొరేషన్లు.. కో-ఆప్షన్ కొలువులో కొత్త లెక్క!

image

జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ఇప్పుడు హాట్ టాపిక్. గతంలో ఐదుగురు సభ్యులకే పరిమితమైన ఈ కోటా ఇప్పుడు ఆరుగురికి పెరగడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. తమకు అవకాశం దక్కుతుందా అని ఆశావాహులు ఆరా తీస్తుండగా, పాత లెక్కలు మారి కొత్త వారి ఎంట్రీకి మార్గం సుగమమైంది. పెరిగిన సభ్యుల బలంతో పాలనలో వేగం పెంచాలని అధికారులు భావిస్తున్నారు.

కొల్లాపూర్: పట్టు నిలబెట్టుకున్న మంత్రి జూపల్లి

image

కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి పట్టు నిలబెట్టుకున్నారు. మొత్తం 19 వార్డులకు గాను 16 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటారు. బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం మూడు స్థానాలలో మాత్రమే విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ ఖాతా తెరవలేదు.