News November 18, 2025
నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి CBN

AP: బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి CM CBN, మంత్రి లోకేశ్‌కు ఆహ్వానం అందింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి అక్కడ 202 సీట్లు సాధించడం తెలిసిందే. సభానేతగా నితీశ్‌కే మళ్లీ అవకాశం దక్కింది. 20న పట్నాలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ఆహ్వానం అందడంతో CBN, లోకేశ్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బిహార్ ఎన్నికల్లో లోకేశ్ NDA తరఫున ప్రచారం చేశారు.
Similar News
News November 18, 2025
‘N-Bomma VS J-Bomma’ టీడీపీ, వైసీపీ విమర్శలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం iBOMMA గురించి చర్చ నడుస్తోంది. ఇదే థీమ్‌తో వైసీపీ, టీడీపీలు ట్విట్టర్ వార్‌కు దిగాయి. J-Bomma అంటూ జగన్ ఫొటోను షేర్ చేస్తూ TDP విమర్శలకు దిగింది. దీనికి కరెక్టెడ్ టూ N-Bomma అంటూ చంద్రబాబు ఫొటోను YCP కౌంటర్ ట్వీట్ చేసింది. నరహంతకుడు, శాడిస్ట్ చంద్రబాబు అంటూ రాసుకొచ్చింది.
News November 18, 2025
బనకచర్ల పేరు మార్చి అనుమతులకు ఏపీ యత్నం: ఉత్తమ్

SC స్టే ఉన్నా ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందని TG మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎత్తు పెంచొద్దని కోర్టు చెప్పిందన్నారు. కేంద్ర మంత్రి CR పాటిల్‌తో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ‘పోలవరం-బనకచర్లను వ్యతిరేకించాం. పేరు మార్చి AP అనుమతులకు యత్నిస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు కోరాం’ అని మంత్రి వివరించారు.
News November 18, 2025
వాట్సాప్ ఛానెల్ ద్వారా ‘జైషే’ ఉగ్ర ప్రచారం

ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ డిజిటల్ నెట్వర్క్ ద్వారా యువతను టెర్రరిజమ్ వైపు మళ్లిస్తోంది. ఈ సంస్థకు సంబంధించిన వాట్సాప్ ఛానెల్‌ను నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ ఛానెల్‌కు 13వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీని ద్వారా వేలాది మందిని ఉగ్రమూకలుగా JeM మారుస్తోంది. కాగా ఢిల్లీ పేలుళ్ల కేసులో అరెస్టు చేసిన డానిష్‌ను పోలీసులు పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అతడిని 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.


