News December 12, 2025

నితీశ్ హ్యాట్రిక్

image

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టారు. ఆంధ్రా జట్టుకు ఆడుతున్న ఆయన మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీశారు. మూడో ఓవర్ 4, 5, 6 బంతులకు వరుసగా హర్ష్, హర్‌ప్రీత్ సింగ్, రజత్ పాటీదార్‌లను పెవిలియన్‌కు పంపించారు. కాగా తొలుత ఆంధ్రా 19.1 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ ఆటగాళ్లు తడబడుతున్నారు.

Similar News

News December 14, 2025

ఓటుకు రూ.40వేలు.. రూ.17 కోట్ల ఖర్చు?

image

TG: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల పరిధిలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల్లో గెలిచేందుకు రూ.17 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.40వేల చొప్పున పంచడమే కాకుండా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు వెండిగ్లాసులు, బంగారు నగలు పంపిణీ చేశారని తెలుస్తోంది. మద్యం పంపిణీకే రూ.4 కోట్లు ఖర్చు చేశారని టాక్. అటు మరికొన్ని చోట్ల గెలిచేందుకు అభ్యర్థులు రూ.లక్షల్లో వెచ్చించినట్లు సమాచారం.

News December 14, 2025

బాలకృష్ణ, బోయపాటి.. 4 సినిమాల్లో ఏది నచ్చింది?

image

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో సినిమా అంటే యాక్షన్ భారీ స్థాయిలో ఉంటుంది. హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వీరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు 4 సినిమాలొచ్చాయి. సింహా(2010), లెజెండ్(2014), అఖండ(2021), అఖండ-2: తాండవం(2025) మాస్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాల్లో బాలకృష్ణ గెటప్స్, డైలాగ్స్, ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. మరి వీటిలో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి.

News December 14, 2025

బయోటిన్ రిచ్ ఫుడ్స్ ఇవే..

image

గోళ్లు, చర్మం, జుట్టు, కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో బయోటిన్ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే దీనికోసం కొందరు సప్లిమెంట్లు వాడుతున్నారు. ఇలా కాకుండా గుడ్డు పచ్చసొన, బాదం, చిలగడదుంపలు, సాల్మన్ ఫిష్, ఆకుకూరలు, పండ్లు, సన్‌ఫ్లవర్ విత్తనాలు వంటివి తింటే బయోటిన్ సహజంగా అందుతుందంటున్నారు నిపుణులు. వీలైనంత వరకు సప్లిమెంట్లకు దూరంగా ఉండాలని, అత్యవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. #WomenHealth