News March 5, 2026

నిత్యవసరాల ధరలు అదుపులో ఉండాలి: జేసీ

image

జిల్లాలో నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై జాయింట్‌ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాలు, ప్రణాళిక, మార్కెటింగ్ శాఖల అధికారులతో కలిసి వివిధ మండలాల్లో వంటనూనెలు, కందిపప్పు, ఎండుమిర్చి హోల్‌సేల్, రిటైల్ ధరల వ్యత్యాసాన్ని వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు.

Similar News

News April 14, 2026

పాలకోడేరు: ఎస్పీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి

image

గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక భారత నిర్మాణంలో అంబేడ్కర్ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News April 14, 2026

భీమవరం కలెక్టరేట్‌లో అంబేడ్కర్ జయంతి

image

భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అసమానతల తొలగింపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 14, 2026

TPG: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ సంఘటన తాడేపల్లిగూడెం మండలం పడాల ఒక పత్రిక కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు వివరించారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.