News December 11, 2025

నిద్ర తక్కువైతే!

image

నిద్ర తక్కువైతే ఆరోగ్యం దెబ్బతిని గుండె జబ్బులు, బీపీ, మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కొన్ని రోజులు సరైన నిద్ర లేకుంటే రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఏకాగ్రత లోపించడం, నిరాశ, కుంగుబాటు వంటివి పెరుగుతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి ఆయుష్షునూ తగ్గిస్తుంది’ అని చెబుతున్నారు. మంచి నిద్ర కోసం ధ్యానం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, క్రమమైన నిద్ర సమయాలు పాటించాలని సూచిస్తున్నారు.

Similar News

News March 3, 2026

ముచ్చటగా మూడోసారి ఎవరిదో పైచేయి!

image

T20 WC సెమీస్‌లో ఎల్లుండి IND-ENG తలపడనున్నాయి. WC చరిత్రలో 2జట్లు రెండుసార్లు తలపడగా చెరోసారి గెలిచాయి. 2022 WC సెమీస్‌లో భారత్‌పై ఇంగ్లండ్ గెలవగా 2024లో ఇంగ్లిష్ జట్టును ఇండియా చిత్తు చేసింది. ఆసక్తికర విషయం ఏమిటంటే 2సార్లు సెమీస్‌లో గెలిచిన జట్టే అంతిమంగా టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో ఈ సారి ఎవరు గెలిచి కప్పు కొడతారనేది ఆసక్తిగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో రెండు జట్లూ బలంగా ఉన్నాయి.

News March 3, 2026

ఖమేనీ కోసం కెమెరాలు, మొబైల్ నెట్‌వర్క్ హ్యాక్?

image

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడికి ఇజ్రాయెల్ ఏళ్లుగా ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. అందుకోసం ఏకంగా ఇరాన్‌లోని ట్రాఫిక్ కెమెరాలన్నింటినీ హ్యాక్ చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. అక్కడి మొబైల్ నెట్‌వర్క్‌లోకీ చొరబడి సమాచారాన్ని సేకరించినట్లు తెలిపింది. ఇది కొన్నేళ్లపాటు జరిగినట్లు వెల్లడించింది. ఖమేనీ బాడీగార్డ్స్‌ కదలికల్ని స్పష్టంగా పసిగట్టగలిగే కెమెరా ఒకటి బాగా ఉపయోగపడినట్లు సమాచారం.

News March 3, 2026

మా రియాక్షన్ ఏంటో త్వరలోనే తెలుస్తుంది: ట్రంప్

image

రియాద్‌లోని US ఎంబసీపై ఇరాన్ డ్రోన్లతో <<19285091>>దాడి<<>> చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ‘మా ఎంబసీపై దాడికి, మా సైనికుల మరణానికి అమెరికా ఇచ్చే సమాధానం ఏంటో మీకు త్వరలోనే తెలుస్తుంది’ అని హెచ్చరించారు. అయితే ఇరాన్‌లోకి నేరుగా సైన్యాన్ని పంపాల్సిన అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్లలో ఆ దేశానికి ఇప్పటికే భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.