News October 15, 2025
నిధులు ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తా: MP

NZB జిల్లాలోని ROBలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుంటే వారంలో నిరాహార దీక్ష చేపడుతానని MP ధర్మపురి అర్వింద్ ప్రకటించారు. BJP జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. అడవి మామిడిపల్లి ఆర్ఓబీకి రూ.22 కోట్లు అవసరమైతే, కొన్ని ఏళ్ల క్రితమే సుమారు రూ.18 కోట్లు డిపాజిట్ చేయగా గత ప్రభుత్వం నిధులను మళ్లించిందన్నారు. మాధవ్ నగర్ ఆర్ఓబీకి కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 70% వచ్చాయన్నారు.
Similar News
News October 15, 2025
భూ భారతి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి: NZB కలెక్టర్

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గ్రామ పాలన అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపి మాట్లాడారు. అర్జీలను త్వరగా పరిష్కరించి సంబంధిత రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత అధికారులదేనన్నారు. గ్రామ స్థాయిలో జీపీఓలు కీలక బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.
News October 15, 2025
నిజామాబాద్: కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ సజావుగా కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
News October 15, 2025
నిజామాబాద్: బీసీ బంద్‌కు సీపీఎం మద్దతు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు ఆరోపించారు. బుధవారం బీసీ జేఏసీ నాయకులు కలిసి ఈ నెల 18న తలపెట్టిన బంద్‌కు మద్దతు కోరగా, సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన 42 శాతం రిజర్వేషన్ల తీర్మానానికి కేంద్రం తక్షణమే ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. బంద్‌ను విజయవంతం చేయాలని రమేష్‌బాబు కోరారు.