News April 29, 2024

నిన్న TDP.. నేడు YCP

image

నెల్లూరు జిల్లా మర్రిపాడు వైస్ ఎంపీపీ చప్పిడి రవణమ్మ తిరిగి వైసీపీ గూటికి చేరారు. నిన్న బ్రాహ్మణపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రాంనారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. 24 గంటలు గడవక ముందే ఆ పార్టీని వీడారు. ఇవాళ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ సమక్షంలో తిరిగి వైసీపీలో చేరడం విశేషం.

Similar News

News December 16, 2025

నెల్లూరు జిల్లాకు TDP కొత్త బాస్ ఈయనే.!

image

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్ర యాదవ్ పేరు ఖరారైంది. కాగా అధికారిక ప్రకటన విడుదల కావల్సి ఉంది. ప్రస్తుతం రవిచంద్ర టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాయలసీమ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. గతంలోనూ ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.

News December 16, 2025

నెల్లూరు జిల్లాకు జోన్-4 కేటాయింపు

image

APలోని 26 జిల్లాలను జోన్‌‌ల వారీగా విభజించే క్రమంలో నెల్లూరు జిల్లాను జోన్-4 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-4గా చోటుదక్కింది.

News December 16, 2025

నేటి నుంచి పండగ (ధనుర్మాసం ) నెల ప్రారంభం

image

నేటి నుంచి ధనుర్మాసం రావడంతో పండగ నెల ప్రారంభం అయినట్లు ప్రముఖ పండితులు లోకా అనంత వెంకట మురళీధర్ శాస్త్రి తెలిపారు. జనవరి 14న భోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ నిర్వహించనున్నట్లు చెప్పారు. మంచు తెరలు ముద్దాడుతున్న వేళ పల్లె గుండెల్లో సంక్రాంతి సవ్వడి మొదలైంది. పండుగ నెల ప్రారంభం కావడంతో ప్రతి ఇంటి ముందు రంగవల్లిలతో తీర్చిదిద్దునున్నారు. గుమగుమలాడే వివిధ రకాల పిండి వంటలు చేసే పనులు నిమగ్నం అవుతారు.