News December 3, 2024

నిపుణుల బృందానికి వరద నష్టం వివరాలను తెలిపిన జిల్లా కలెక్టర్

image

ఖమ్మం జిల్లాకు మంగళవారం విచ్చేసిన అంచనా నిపుణుల బృందానికి ఇటీవలి వరద నష్ట తీరు, చేపట్టిన చర్యల వివరాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. 229 గ్రామాలలో, 42 పట్టణ ప్రాంతాల్లో 53,430 మంది జనాభా ప్రభావితమయ్యారని, 59 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 9516 మందిని శిబిరాలకు తరలించడం జరిగిందని తెలిపారు. 6 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక్కొక్కరికి ₹5 లక్షల చొప్పున ₹30 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించామన్నారు.

Similar News

News December 4, 2024

సత్తుపల్లి: రేపు మెగా ఫుడ్ పార్క్ ప్రారంభం

image

సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో మెగా ఫుడ్ పార్క్‌ను రాష్ట్ర మంత్రులతో గురువారం ప్రారంభిస్తున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద చెప్పారు. ఈ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పాల్గొంటారని చెప్పారు. కావున మీడియా మిత్రులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.

News December 4, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు ∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటన

News December 4, 2024

BREAKING: KMM: తెలంగాణ ఉద్యమకారుడు మృతి

image

తెలంగాణ ఉద్యమకారుడు మోరే భాస్కర్‌రావు శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ ఈరోజు మరణించారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కొత్తగూడెం ప్రాంతం నుంచి ఆయన కీలక పాత్ర పోషించారు. 2001లో KCR ప్రారంభించిన TRS పార్టీ తరఫున ఈ ప్రాంతం నుంచి కీలక నేతగా పనిచేశారు. వార్డు కౌన్సిలర్‌గా, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా విధులు నిర్వహించారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు మోరే భాస్కర్.