News July 5, 2025

నిబంధనలను పాటించకుంటే చర్యలు: గీతాబాయి

image

చట్టపరిధిలో నియమ నిబంధనలను పాటించని స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. గీతాబాయి హెచ్చరించారు. శుక్రవారం భీమవరంలో మెడ్ క్వెస్ట్ స్కానింగ్ సెంటర్‌ను గీతాబాయి తనిఖీ చేశారు. స్కాన్ సెంటర్లో పీసీ పీఎన్ డీటీ చట్టం పరిధిలో నిర్వహించాల్సిన నియమ నిబంధనలను పరిశీలించారు.

Similar News

News July 6, 2025

ఖమ్మం శ్రీలక్ష్మీ రంగనాథ ఆలయంలో ఏకాదశి వేడుకలు

image

ఖమ్మం రంగనాయకుల గుట్టపై స్వయంభు కరిగిరి శ్రీలక్ష్మీ రంగనాథస్వామి వారి దేవస్థానంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు బూరుగడ్డ శ్రీధరాచార్యులు తెలిపారు. తెల్లవారుజామున 5:30 గంటలకు ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకం, సువర్ణపుష్పార్చన, ఉదయం 9:30కు సుదర్శన హోమం, మధ్యాహ్నం 12 గంటలకు మహా పూర్ణాహుతి ఉంటుందని, భక్తులు సకాలంలో హాజరై, స్వామివారి ఆశీస్సులు పొందాలని సూచించారు.

News July 6, 2025

జాతీయ స్థాయి హాకీ పోటీలకు ధర్మవరం క్రీడాకారుల ఎంపిక

image

జార్ఖండ్ రాజధాని రాంచిలో జరుగుతున్న 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ మహిళల హాకీ పోటీలలో రాష్ట్ర జట్టుకు ధర్మవరానికి చెందిన మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా జనరల్ సెక్రటరీ బి.సూర్యప్రకాష్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు జరిగే హాకీ పోటీలలో రాష్ట్ర జట్టు తరఫున మధురిమా భాయ్, వైష్ణవి, వర్ష పాల్గొంటారన్నారు. కేరళ రాష్ట్ర జట్టుకు తలారి హేమ ఎంపికయ్యారని పేర్కొన్నారు. క్రీడాకారులను అభినందించారు.

News July 6, 2025

కర్నూలు డీసీసీ ఇన్‌ఛార్జిగా లక్ష్మీ నరసింహ యాదవ్

image

కర్నూలు డీసీసీ ఇన్‌ఛార్జిగా నంద్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ యాదవ్‌ను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ యాదవ్ స్థానంలో డీసీసీగా లక్ష్మీ నరసింహ యాదవ్‌ను నియమించడం పట్ల రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.