News October 12, 2025

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఎస్పీ

image

నిబంధనలు అతిక్రమించి అక్రమంగా బాణసంచా తయారు చేసినా, విక్రయించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డా. అజిత వేజెండ్ల హెచ్చరించారు. ప్రజల శ్రేయస్సు కోసం బాణసంచా తయారీ కేంద్రాలు, స్టోరేజ్ గోడౌన్స్, మందు గుండు సామాగ్రి విక్రయించే దుకాణాలను, పరిసర ప్రాంతాల భద్రతాపరమైన ప్రామాణికలను పాటిస్తున్నారా లేదా అని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

Similar News

News October 12, 2025

కలువాయి: వృద్ధ దంపతుల ఆత్మహత్య

image

కలువాయి మండలం తోపుగుంట అగ్రహారానికి చెందిన వృద్ధ దంపతులు వింజం కొండయ్య, వింజం రత్నమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి సమీపంలోని పొలాల్లో విష గుళికలు తిని మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై కోటయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది

News October 12, 2025

పీపీపీ విధానంలో 110 మెడికల్ సీట్లు అదనం : సీఎం

image

కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ ప్రారంభించిన తర్వాత మాట్లాడారు. దీని వల్ల పేద విద్యార్థులకు అదనంగా 110 మెడికల్ సీట్లు వస్తాయని తెలిపారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానంలో ఆసుపత్రులు కడితే మరో 20 ఏళ్లు సమయం పడుతుందని, అప్పటివరకు పేదలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు.

News October 11, 2025

గంజాయి, మద్యంతో విచక్షణ కోల్పోతున్న యువత

image

జంట హత్యలతో నెల్లూరు నగరం ఉలిక్కిపడింది. మత్తులో విచక్షణ కోల్పోయిన నిందితులు కత్తులతో దాడులు, దోపిడీలు చేస్తున్నారు. రాము మద్యం డబ్బుల కోసం స్నేహితుడిపై కత్తితో దాడి చేయగా, మరో ఘటనలో డబ్బులివ్వలేదని చెప్పినవారిపై దాడి జరిగింది. నగరంలో గంజాయి, మద్యం విక్రయాలు విస్తరిస్తుండటంతో నేరాలు పెరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పాతనేరస్తులు రోడ్లపై కాపు కాస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు.