News October 12, 2025

నిబంధనలు ఉల్లంఘిస్తే బాణాసంచా దుకాణాలపై కఠిన చర్యలు: ఎస్పీ

image

అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా నిల్వ ఉంచినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ (ఐపీఎస్) ఆదివారం హెచ్చరించారు. బాణాసంచా దుకాణం వద్ద నీరు, ఇసుక, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ వంటి అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉంచాలన్నారు. విక్రయాలలో మైనర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Similar News

News October 12, 2025

గుంటూరు జిల్లాలో ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్‌లు

image

@ కలెక్టర్ తమీమ్ అన్సారియా: 9849904002.
@ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ: 9849904003.
@ గుంటూరు IG సర్వ శ్రేష్ట త్రిపాటి: 9440627241.
@ SP వకుల్ జిందాల్: 8688831300.
@ ASP అడ్మిన్: 8688831302.
@ DMHO విజయలక్ష్మీ: 9849902337.
@ DEO రేణుక: 9849909107.
@ DFO: 9949991062.
@ DTC: 9154294107.
@ గుంటూరు RTC RM: 9959225412.
@ Lost Cellphone Whatsapp:8688831574.

News October 12, 2025

GNT: ప్రభుత్వ అధికారులను ప్రశ్నించే హక్కు మీకుంది.!

image

అక్టోబర్ 12, 2005న సమాచార హక్కు చట్టం (RTI) దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రజలకు ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం కోరుకునే, తెలుసుకునే హక్కును కల్పించింది. గ్రామస్థాయిలో పంచాయతీలు, మున్సిపల్ కార్యాలయాలు, రెవెన్యూ శాఖలు వంటి విభాగాల్లో అవినీతి, నిర్లక్ష్యంపై ప్రశ్నలు వేయగలిగారు. గుంటూరు జిల్లాలో అనేక సామాజిక కార్యకర్తలు ఈ చట్టాన్ని వినియోగించి ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను బయటపెట్టారు.

News October 12, 2025

ఫిర్యాదులు రాయడానికి ప్రత్యేక పోలీస్ సిబ్బంది: ఎస్పీ

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే PGRS కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదులు రాయించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ మేరకు ప్రజలకు సులభతరం చేయడానికి ప్రత్యేక సిబ్బందిని కేటాయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సదుపాయం అక్టోబర్ 13 నుంచి ప్రారంభమవుతుందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఫిర్యాదుదారులు ఉపయోగించుకోవాలని తెలిపారు.