News July 28, 2024
నిబంధనల ప్రకారమే ఆక్రమణ తొలగింపు: MRO

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధన్నానపేటలో ఆక్రమణను తొలగించినట్లు నెల్లిమర్ల తహశీల్దార్ ధర్మరాజు స్పష్టం చేశారు. రోడ్డును ఆక్రమించి నిర్మించిన ప్రహరీగోడను, ప్రజా ప్రయోజనాల కోసమే తొలగించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆక్రమణ దారునికి ముందుగా నోటీసులు కూడా ఇచ్చామని, తగిన గడువు ఇచ్చిన తరువాత, అతని నుంచి స్పందన రాకపోవడంతో తొలగించినట్లు తహశీల్దార్ తెలిపారు.
Similar News
News February 28, 2026
రౌడీల్లారా.. రాష్ట్రాన్ని విడిచి పలాయనం చేయండి: సీఎం

అలర్లు, దౌర్జన్యాలు, రౌడీయిజంతో బతికేద్దామనుకున్నవారు తక్షణమే రాష్ట్రాన్ని విడిచి పారిపోవాలని సీఎం చంద్రబాబు శనివారం జరిగిన రావివలస సభలో హెచ్చరించారు. మత్తులో తప్పు చేసే గంజాయి మూకలను చిత్తు చేస్తామన్నారు. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్ అని చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. చెడు దారిలో వెళుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించి దారిలో పెడతామని స్పష్టం చేశారు.
News February 28, 2026
కాకినాడలో భారీ పేలుడు.. హుటాహుటిన బయలుదేరిన హోంమంత్రి అనిత

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి సుమారు 20 మంది సజీవ దహనం ఆయన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విజయనగరం జిల్లా చీపురుపల్లి పర్యటనలో ఉన్న హోంమంత్రి అనిత హుటాహుటిన ఘటనా స్థలికి పయనమయ్యారు. ఇప్పటికే అక్కడ అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు.
News February 28, 2026
వచ్చే మూడేళ్లలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాజెక్టులు పూర్తి: సీఎం

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని పెండింగ్‌లో ఉన్న తాగునీటి ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రావివలస ప్రజా వేదికలో ఆయన మాట్లాడారు. పోలవరం నుంచి సుజల స్రవంతి ద్వారా విశాఖకి త్వరలోనే నీరు అందిస్తామన్నారు. వంశధార, నాగావళి, చంపావతి నదులను గోదావరితో అనుసంధానం చేస్తామన్నారు.


