News September 4, 2025
నిబద్ధతతో పనిచేస్తేనే మనుగడ: ఖమ్మం అ.కలెక్టర్

నిబద్ధతతో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన గ్రామ పాలన అధికారులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ గురువారం సమావేశం నిర్వహించి, ఆప్షన్ ఫారంలను స్వీకరించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో 253 మంది ఉత్తీర్ణత సాధించారని, వీరిలో 240 మంది లోకల్, 13 మంది నాన్ లోకల్ ఉన్నారని పేర్కొన్నారు.
Similar News
News September 4, 2025
ఖమ్మం: విద్యుత్ సమస్యల కోసం వాట్సాప్ సేవలు

విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం TGNPDCL ఆధునిక సేవలను ప్రారంభించింది. ఇకపై విద్యుత్ బిల్లులు, ఇతర ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ 79016 28348ను సంప్రదించవచ్చు. ఈ నంబర్‌కు మెసేజ్ పంపి బిల్లుల వివరాలు తెలుసుకోవచ్చు, అలాగే ఫిర్యాదులు కూడా చేయవచ్చు. వాట్సాప్ సేవలతో పాటు www.tgnpdcl.com వెబ్‌సైట్, టోల్‌ఫ్రీ నంబర్ 1912 ద్వారా కూడా సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఎస్‌ఈ శ్రీనివాస చారి తెలిపారు.
News September 4, 2025
ఖమ్మం జిల్లాలో అక్కడే అత్యధికం.!

ఖమ్మం జిల్లాలో బుధవారం ఉదయం 8:30 నుంచి గురువారం ఉదయం 8:30 వరకు 46.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సత్తుపల్లిలో 20.6, వేంసూరు 6.0, నేలకొండపల్లి 4.8, చింతకాని, ఖమ్మం అర్బన్ 3.6, మధిర 3.4, బోనకల్ 2.2, ముదిగొండ 1.8, వైరా మండలంలో 0.6 నమోదైనట్లు చెప్పారు. అటు ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.
News September 4, 2025
ఖమ్మం జిల్లాకు 307 మంది నూతన జీపీఏఓలు

గ్రామపాలనాధికారి పరీక్షలో ఉత్తీర్ణులైన ఖమ్మం జిల్లాకు చెందిన 307 మంది అభ్యర్థులకు ఈ నెల 5న నియామక పత్రాలు అందనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ పత్రాలు అందజేస్తారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఈ నియామకాలతో గ్రామస్థాయిలో పరిపాలన మరింత పటిష్టం కానుంది.