News September 11, 2025

నిబద్ధత కలిగిన కార్యకర్తలే పార్టీ బలం: మర్రి జనార్దన్ రెడ్డి

image

అమ్రాబాద్ మండల కేంద్రంలో అమ్రాబాద్, పదర మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. నిబద్ధత కలిగిన కార్యకర్తలే పార్టీకి బలమని అన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

Similar News

News September 11, 2025

మైలవరం: కుమార్తెను హత్య చేసిన తండ్రి

image

శాంతినగర్‌కు చెందిన బాజీకి ఇద్దరు భార్యలు. గంజాయి కేసులో రెండో భార్య జైలుకు వెళ్లగా, ఆమె కుమార్తె గాయత్రి(14) మొదటి భార్య నాగమణితో కలిసి ఉంటోంది. ఈ నెల 3న గాయత్రి పెద్దమ్మ, తన తమ్ముడు బాజీ కూతురును హత్య చేసి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా పోలీసులు బాజీని ప్రశ్నించగా, తానే హత్య చేసి, మృతదేహాన్ని చెరువులో పడేసినట్లు అంగీకరించాడు. పోలీసులు బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు.

News September 11, 2025

VZM: ఉమ్మడి జిల్లా న్యాయవాదులతో వీడియో కాన్ఫెరెన్స్

image

విజయనగరం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి బబిత ఉమ్మడి జిల్లా న్యాయవాదులతో బుధవారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. వచ్చేనెల 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను న్యాయవాదులు విజయవంతం చేయాలని సూచించారు. రాజీకు వచ్చే ప్రమాద బీమా క్లెయిమ్ కేసులు, అన్ని సివిల్ దావాలు, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, బ్యాంకు, తదితర కేసులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.

News September 11, 2025

చల్లపల్లి: పాఠశాల అన్నంలో పురుగులు

image

చల్లపల్లి (M) పురిటిగడ్డ ZP హైస్కూల్‌లో బుధవారం మధ్యాహ్నం విద్యార్థుల కోసం వండిన అన్నంలో పురుగులు కనిపించాయి. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే HM కె.బి.ఎన్ శర్మ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి, బియ్యాన్ని జల్లించి శుభ్రం చేయించి వండించారు. వండిన అన్నం నాణ్యతను స్వయంగా పరిశీలించి, ఆ తర్వాతే విద్యార్థులకు వడ్డించారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.