News October 8, 2025
నిబద్ధత, పారదర్శకతతో పనిచేయండి: యాదాద్రి కలెక్టర్

గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేందుకు, గ్రామ పాలన అధికారులు (వీఆర్‌ఓలు) నిజాయతీగా, నిబద్ధత, పారదర్శకంగా పనిచేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. వారిపై నమ్మకంతోనే తిరిగి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కొత్తగా నియామకం పొందిన గ్రామ పాలన అధికారుల శిక్షణా కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.
Similar News
News October 8, 2025
KMR: జిల్లాలో రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ షురూ!

BC రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో షెడ్యూల్ ప్రకారం OCT 9న నామినేషన్ల ప్రక్రియ షురూ కానున్నాయి. కామారెడ్డి జిల్లాలో తొలి విడతలో భాగంగా 14 మండలాల్లో ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్లు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వెల్లడించారు.
News October 8, 2025
విద్యా సంస్థల సమ్మె వాయిదా

TG: ఈనెల 13 నుంచి సమ్మెకు దిగుతామన్న ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య కాస్త వెనక్కి తగ్గింది. CMతో చర్చిస్తామని ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో సమాఖ్య ప్రతినిధులు సమ్మెను వాయిదా వేశారు. దీపావళిలోగా రూ.300 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. దీంతో OCT 13 నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మె, కళాశాలల బంద్ కార్యక్రమాన్ని OCT 23కు వాయిదా వేయాలని నిర్ణయించారు.
News October 8, 2025
సంగారెడ్డి: ‘అన్ని పాఠశాలలో డిజిటల్ లిట్రసి తరగతులు’

జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ లిట్రసి తరగతులు అమలు చేయాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 5 వ తరగతులకు అమలు చేసే విధంగా మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ ప్రధానోపాధ్యాయులు గమనించాలని పేర్కొన్నారు.