News September 5, 2025
నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన మెదక్ కలెక్టర్

రామాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ రజనీకుమారి, కమిషనర్ దేవేందర్, కాంగ్రెస్ నాయకులు సుప్రభాత్ రావు, గజవాడ నాగరాజు పాల్గొన్నారు.
Similar News
News September 5, 2025
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మెదక్ ఎస్పీ

వినాయక నిమజ్జనం సందర్భంగా మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్లను జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా కొంటూర్ నిమజ్జనం పాయింట్‌ను సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా, ప్రశాంతంగా జరగడానికి చేపట్టిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
News September 5, 2025
MDK: కార్మిక నేత ఎల్లయ్య.. మొదటి ప్రభుత్వ టీచర్

అకాల మరణం పొందిన బీహెచ్ఈఎల్ పరిశ్రమ కార్మిక సంఘం సీనియర్ నాయకులు ఎల్లయ్య ఒకప్పుడు హవేలి ఘనపూర్ మండలం జక్కన్నపేటలో మొదటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఏడాదిన్నర తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ పరిశ్రమలో ఉద్యోగంలో చేరారు. ఆయన స్వగ్రామం రామయంపేట మండలం అక్కన్నపేట. కార్మిక నాయకుడిగా ఎదిగి తెలంగాణ వాదం వినిపించారు. వివిధ పరిశ్రమల కార్మికుల సమస్యల పరిష్కారంలో ఎల్లయ్య పాత్ర మరువలేనిది.
News September 4, 2025
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్

నర్సాపూర్‌లోని రాయరావుచెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. గణనాథుల నిమజ్జనానికి తరలివచ్చే సమయంలో భక్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై తెలియజేయాలని పుర కమిషనర్‌కు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మైపాల్, తహశీల్దార్ శ్రీనివాస్, నీటిపారుదలశాఖ మండల అధికారి మణిభూషణ్, మునిసిపల్ సిబ్బంది, తదితరులున్నారు.