News August 25, 2025

నిమజ్జనాల వరకు పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

వినాయక చవితి వేడుకల సందర్భంగా విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనాల వరకు పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. వినాయక చవితి పండుగ కార్యక్రమాలపై ఐడీవోసీలో సమీక్ష నిర్వహించారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

Similar News

News August 25, 2025

మట్టి వినాయక విగ్రహాల పంపిణీలో కలెక్టర్

image

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర ధార్మిక పరిషత్ ఛైర్మన్ వంగపల్లి అంజయ్య స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాల వల్ల జరిగే కాలుష్యం గురించి వివరించారు.

News August 25, 2025

WNP: ముఖ చిత్ర గుర్తింపుతో పింఛన్లు పంపిణీ

image

వనపర్తి జిల్లాలో సామాజిక పింఛన్లు ఇక నుండి ముఖ చిత్ర గుర్తింపు ద్వారా ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఇక నుంచి వెలి ముద్రల గుర్తింపు ఇబ్బంది లేకుండా ముఖ చిత్రం గుర్తింపు ద్వారా పోస్టాఫీసుల్లో పింఛన్లు ఇవ్వనున్నారు. దీనికోసం సోమవారం పోస్టాఫీస్ అధికారికి 74 ముఖ చిత్ర గుర్తింపు చేసే సెల్ ఫోన్లను కలెక్టర్ అందజేశారు. డీఆర్‌డీఓ, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

News August 25, 2025

అల్లూరి: మంత్రగాడి నెపంతో వృద్ధుడి హత్య

image

అల్లూరి జిల్లాలో సోమవారం ఘోరం చోటు చేసుకుంది. చింతూరు మండలం లక్కవరం గ్రామానికి చెందిన మట్టా రామయ్య (70) హత్యకు గురయ్యాడు. అతని తల నరికి దగ్ధం చేసినట్లు సమాచారం. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఈ హత్య జరిగినట్లు సమాచారం. హత్యపై సమాచారం వచ్చిందని కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోపాలకృష్ణ తెలిపారు.