News September 5, 2025

నిమజ్జనోత్సవం.. ముంబైతో HYD ఢీ

image

గతంలో గణేశ్ నిమజ్జనోత్సవాలంటే అందరికీ ముంబై గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు ఇందులోకి HYD గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలంగా ముంబైకి ధీటుగా పోటీ పడుతోంది. ముంబైలో దాదాపు 3 లక్షల విగ్రహాలు ప్రతిష్ఠిస్తే సిటీలో 1.71 లక్షలు ప్రతిష్ఠించారు. అక్కడ 70 చెరువుల్లో నిమజ్జనం జరిగితే ఇక్కడ 20 చెరువుల వద్ద వేడుక జరుగుతోంది. ఇక్కడ దాదాపు 30 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తే అక్కడ 24వేలమందే విధుల్లో ఉంటున్నారు.

Similar News

News September 5, 2025

HYD: మహిళా వర్సిటీ విద్యార్థినుల ఫోన్లు హ్యాక్

image

కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్థినుల ఫోన్ నంబర్లు సైబర్ నేరస్థులు హ్యాక్ చేశారు. దాదాపు 100 మంది విద్యార్థులకు కాల్ చేస్తూ, మెసేజ్‌లు పెడుతుండటంతో విద్యార్థినులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీసీ ప్రొ.సూర్య ధనుంజయ్ సూచన మేరకు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

News September 5, 2025

HYD: నేరెళ్ల ఇస్కాన్ ప్రాజెక్టుకు రోడ్డు వసతికి వినతి

image

ప్రజాభవన్లో ఇస్కాన్ ప్రతినిధులను మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో 18 ఎకరాల్లో గోశాల, అన్నదాన సత్రం, సేంద్రియ వ్యవసాయం, సోలార్ విద్యుత్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఇస్కాన్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. రహదారి వసతి కల్పించాలని చేసిన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.

News September 5, 2025

HYD: సందర్శకుల కోసం పార్కింగ్ ఇక్కడే

image

రేపు నగరంలో వినాయక నిమజ్జనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సందర్శకులకు పార్కింగ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ MMTS స్టేషన్, ఆనంద్‌నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జడ్పీ ఆఫీస్ మధ్య, బుద్ధభవన్ పక్కన, ఎన్టీఆర్ స్టేడియం, నిజాంకాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, లోయర్ ట్యాంక్ బండ్, గో సేవా సదన్, కట్ట మైసమ్మ టెంపుల్ వద్ద ఏర్పాటు చేశారు.