News November 14, 2024
నిమోనియా దినోత్సవ గోడపత్రిక ఆవిష్కరించిన చిత్తూరు కలెక్టర్

నిమోనియా దినోత్సవ గోడపత్రికను చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిమోనియా వ్యాధి లక్షణాలు, తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలపై వైద్య అధికారులు విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు గ్రామాలలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలన్నారు.
Similar News
News February 12, 2026
చిత్తూరు: 17న ఈ ట్యాబ్లెట్లు తీసుకోండి..!

చిత్తూరు జిల్లాలో ఈనెల 17 నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించనున్నట్లు DMHO సుధారాణి తెలిపారు. జిల్లాలో 1-19 ఏళ్లలోపు మొత్తం 3,62,535 మంది పిల్లలు, యువతకు ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 1-5 ఏళ్లలోపు 77,318 మంది చిన్నారులు ఉండగా, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 2,84,060 మందికి.. బడి బయట ఉన్న1157 మందికి మాత్రలు అందిస్తామన్నారు.
News February 12, 2026
చిత్తూరు జిల్లాలో మీకు ఈ విషయం తెలుసా?

కంగి, కంగడు అనే బందిపోటు దొంగలు 1066-1132 మధ్య కుప్పం ప్రాంతానికి అధిపతులుగా పాలించారు. దట్టమైన అరణ్యంలో ఎరుకలు, యానాది కులాలకు చెందిన బందిపోటు దొంగలు అక్కడక్కడ స్థావరాలను ఏర్పరచుకున్నారు. నాటి పాలకుల పేరును చిరస్థాయిగా నిలిపేలా ఈ ప్రాంతానికి కంగుంది దుర్గం అనే పేరు పెట్టారని స్థానికులు చెబుతున్నారు. తర్వాత జమీందారుల పాలన కొనసాగుతూ 1950 వరకు సుమారు 884 ఏళ్లు ఈ కోట రాజధానిగా ఉండేది.
News February 12, 2026
చిత్తూరు: పరీక్షల్లో అధికారుల ఫెయిల్.. 19మందిపై చర్యలు

రెవెన్యూ శాఖలో తాత్కాలిక షరతులతో సీనియర్ అసిస్టెంట్లుగా ఇటీవల ప్రమోషన్ వచ్చింది. శాఖాపరమైన పరీక్షల్లో పాస్ కాకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 19 మందిని తిరిగి గ్రేడ్-1 వీఆర్వోలుగా రివర్షన్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. వీరు శాఖపరమైన పరీక్షల్లో అనుకున్న మేర ఫలితాలు సాధించకపోవడంతో రివర్షన్ ఇచ్చినట్టు అందులో పేర్కొన్నారు.


