News December 31, 2025
నిమ్మకాయ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి?

రాహుకాలంలో మాత్రమే వెలిగించాలి. మంగళవారం ఉత్తమం. శుక్రవారం అంతకన్నా ఉత్తమం. అయితే శుభ దినాల్లో, ఉపవాసం ఉండే రోజుల్లో వెలిగించకూడదు. పండుగ రోజున, పెద్దల తిథి ఉన్నప్పుడు, ఇంట్లో జన్మదినాలు, జయంతి, పెళ్లిరోజులప్పుడు నిషిద్ధం. ఈ పరిహారం పాటిస్తే ఆరోజున ఊరు దాటి వెళ్లకూడదు. పట్టుచీర ధరించి వెలిగిస్తే ఎక్కువ ఫలితముంటుంది. ఈ దీపం పెడితే ఇతర దీపాలేవీ వెలిగించకూడదు. ఎరుపు, పసుపు రంగు వస్త్రాలు ధరించాలి.
Similar News
News December 31, 2025
APPLY NOW: 102 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

<
News December 31, 2025
764పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

DRDOకు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్‌లో 764 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, BSc, BLSc, MLSc, టెన్త్, ITI అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి JAN 3వరకు అవకాశం ఉంది. వయసు 18-28 ఏళ్లు ఉండాలి(రిజర్వేషన్ వారికి సడలింపు). టైర్ 1, టైర్ 2 రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీ వెళ్లండి.
News December 31, 2025
నా కూతురికి యాక్టర్ కావాలని లేదు: రోజా

తన కూతురు అన్షు భవిష్యత్తుపై నటి, మాజీ మంత్రి రోజా క్లారిటీ ఇచ్చారు. ‘అన్షుకు యాక్టర్ కావాలనే కోరిక లేదు, సైంటిస్ట్ కావాలనుకుంటోంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ పరిశోధనలపై దృష్టి సారించింది. పిల్లలకు భవిష్యత్తును నిర్ణయించుకునే విషయంలో స్వేచ్ఛను ఇచ్చాను’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. స్టార్ హీరో కొడుకుతో అన్షు పెళ్లిపై స్పందిస్తూ.. ‘ఆ హీరో ఎవరో చెబితే తెలుసుకుంటా’ అని నవ్వుతూ జవాబిచ్చారు.


