News March 26, 2025
నిమ్మగడ్డి పంట సాగుకు పార్వతీపురం జిల్లా అనుకూలం: కలెక్టర్

మన్యం జిల్లాలో రెండు వేల ఎకరాల్లో నిమ్మగడ్డి పంట సాగు చేసేందుకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించారు. రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగింది. తొలి రోజు జరిగిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ.. నిమ్మగడ్డి పంట సాగుకు జిల్లా అనుకూలంగా ఉంటుందన్నారు.
Similar News
News December 27, 2025
సిరిసిల్ల: ఉపాధి కూలి పెంపు ప్రకటనపై పెరుగుతున్న ఆశలు

జీ రామ్ జీ ఉపాధి హామీ పథకం కింద దినసరి కూలి పెంచే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుండడం ఉపాధి కూలీలలో ఆశలను పెంచుతోంది. ఏటా 100 పని దినాలను 125 రోజులకు పెంచిన నేపథ్యంలో దినసరి కూలిని రూ.270ల నుంచి రూ.325ల వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. కూలి పెంపుపై ఇంకా తుది ప్రకటన వెలువడనప్పటికీ, పెంచే ఆస్కారం కనిపించడం కూలీలలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.
News December 27, 2025
భారీ స్కాంలో చిత్తూరు జిల్లా ఫస్ట్.!

చిత్తూరు జిల్లాలో నకిలీ GST స్కాంలో రూ.118.70 కోట్ల మేర అవినీతి జరిగినట్లు అధికారులు తేల్చారు. వివిధ కంపెనీల పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి రూ.కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కొల్లగొట్టారు. వాటి వివరాలు: ☞ లలిత ట్రేడర్స్-రూ.25.43 కోట్లు ☞ RP ఎంటర్ప్రైజెస్-రూ.15.98కోట్లు ☞ తాజ్ ట్రేడర్స్-రూ.13.37 కోట్లు ☞మహాదేవ్ ఎంటర్ప్రైజెస్- రూ.9.54 కోట్లు. మరింత సమాచారం కోసం <<18683267>>క్లిక్<<>> చేయండి.
News December 27, 2025
హుస్నాబాద్: పుత్ర శోకం తట్టుకోలేక తండ్రి మృతి

వారం రోజుల వ్యవధిలోనే తండ్రి, కుమారుడు మృతి చెందడంతో హుస్నాబాద్ మం. గాంధీనగర్‌లో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రావు(53) ఈనెల 20న గుండెపోటుతో మరణించారు. చేతికందిన కొడుకు దూరం కావడాన్ని తండ్రి చొక్కారావు(85) తట్టుకోలేకపోయారు. కొడుకు అంత్యక్రియల రోజే స్పృహతప్పి పడిపోయిన ఆయన, శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మరణించడంతో ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి.


