News October 17, 2024
నిమ్మనపల్లెలో మిస్సింగ్.. బెంగళూరులో దారుణ హత్య
నిమ్మనపల్లెలో మిస్సింగ్ అయిన యువకుడు బెంగళూరులో స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని గుండ్లబురుజు దళితవాడకు చెందిన బాలాజీ(24) పవణహళ్లి పీఎస్ పరిధిలోని దొడ్డనహళ్లిలో రామసముద్రానికి చెందిన స్నేహితుడి భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. దీంతో స్నేహితుడి చేతిలో హత్యకు గురయ్యాడని గురువారం ఉదయం బెంగుళూరు, పవణహళ్లి ఎస్ఐ సెల్వ తెలిపారు. మధ్యాహ్నంలోగా స్వగ్రామానికి మృతదేహం రానుంది.
Similar News
News December 27, 2024
మాజీ మంత్రి రోజా కుమార్తెకు గ్లోబల్ అవార్డు
మాజీ మంత్రి ఆర్‌కే రోజా కుమార్తె అన్షు మాలిక సామాజిక ప్రభావానికి సంబంధించిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్స్ అవార్డ్ గెలుచుకున్నారు. దీంతో ఆర్‌కే రోజా మాట్లాడుతూ.. అన్షు మాలికకు గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్స్ అవార్డు రావడంతో ఎంతో ఆనంందంగా ఉందని అన్నారు. ఆమె కృషి, పట్టుదల ఫలించాయని అన్నారు. ఆనంతరం అభినందనలు తెలిపారు.
News December 27, 2024
మన్మోహన్ సింగ్‌కు తిరుపతి జిల్లాతో ప్రత్యేక అనుబంధం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తిరుపతి జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. 2010 సెప్టెంబర్ 1న జిల్లాలో రెండు ప్రధాన అభివృద్ధి పనులు ఆయన చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. అందులో ఒకటి తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే పనులకు శంకుస్థాపన చేశారు. రెండోది మన్నవరం ఎన్టీపీసీ-భెల్ ప్రాజెక్టు పనులను మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
News December 27, 2024
కాలినడకన తిరుమల చేరుకున్న పీవీ సింధు
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన గురువారం తిరుమలకు చేరుకున్నారు. నూతన దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. శుక్రవారం వేకువజామున ఆమె శ్రీవారి అభిషేక సేవలో స్వామి వారిని దర్శించుకోనున్నారు.