News December 30, 2025
నిమ్మ తోటల్లో అంతర పంటలతో అధిక ఆదాయం

నిమ్మ తోటల్లో తొలి ఐదేళ్లు అంతర పంటలను సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. అంతర పంటలతో కలుపు ఉద్ధృతి కూడా తగ్గుతుంది. వేరుశనగ, పెసర, మినుము, చిక్కుడు, బీన్స్, బంతి, దోస, పుచ్చ, బీర, కాకర, ఉల్లిని అంతర పంటలుగా వేసుకోవచ్చు. టమాటా, మిరప, వంగ, బెండ, పొగాకు లాంటి పంటలు అంతర పంటలుగా వేస్తే నులు పురుగులు వచ్చే అవకాశం ఉంది కావున వాటిని అంతర పంటలుగా వేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News December 30, 2025
₹50 లక్షల జాయినింగ్ బోనస్

ఇండిగో పైలట్స్ రిక్రూట్మెంట్ స్పీడప్ చేసింది. ₹15లక్షలు-₹25L గల జాయినింగ్ బోనస్‌ను ₹50L వరకు పెంచుతోంది. అయితే బోనస్‌తో పాటు శాలరీ స్ట్రక్చర్, వర్కింగ్ కండీషన్సూ మారాలని ఏవియేషన్ నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడ సరైన లైఫ్ స్టైల్ లేక పైలట్స్ విదేశాలకు వెళ్తున్నారని చెబుతున్నారు. కాగా అలసట, ఒత్తిడి తగ్గించేలా పైలట్లకు వారంలో 48Hrs విరామం ఉండాలన్న కొత్త రూల్‌తో స్టాఫ్ కొరత ఏర్పడింది.
News December 30, 2025
పాన్-ఆధార్ లింక్.. రేపే లాస్ట్ డేట్

పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు గడువు రేపటితో(DEC 31) ముగియనుంది. లింక్ చేసేందుకు IT <
News December 30, 2025
బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి హత్య

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. మైమెన్సింగ్ జిల్లాలోని వాలుకా ప్రాంతంలోని ఓ దుస్తుల కర్మాగారంలో పని చేస్తున్న హిందూ కార్మికుడు బజేంద్ర బిస్వాస్ హత్యకు గురయ్యారు. సహోద్యోగి నోమన్ మియా షాట్‌గన్‌తో కాల్చగా అది బిస్వాస్ తొడకు తగలడంతో తీవ్ర గాయాలైనట్లు అక్కడి అధికారులు చెప్తున్నారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలోపు మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.


