News April 5, 2025

నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

image

HYD నిమ్స్ ఆసుపత్రిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. మిలీనియం బ్లాక్‌లో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ కార్డియాక్ ఐసీయూలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. డాక్టర్ మాలెంపాటి అమరేశ్ రావు నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. తల్లిదండ్రుల ఆధార్, రేషన్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో ఉ.10 నుంచి సా.4 వరకు పాత భవనం మొదటి అంతస్తు ఆరో వార్డులో సంప్రదించాలి.

Similar News

News April 6, 2025

లక్ష్య సాధనకు కృషి చేయాలి: ఖమ్మం కలెక్టర్

image

పోటీ పరీక్షల్లో అభ్యర్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు ప్రణాళికాయుతంగా కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్-డీ, జూనియర్ లెక్చరర్, ఆర్ఆర్‌బీ, ఐడీబీసీ వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారితో ఆయన మాట్లాడారు. పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతున్నారు, ఎలాంటి పుస్తకాలు కావాలి, ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.

News April 6, 2025

ఒంగోలు: పూర్తయిన ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్

image

ఒంగోలు నగరంలోని ఏకేవీకే జూనియర్ కళాశాలలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ముగిసింది. మార్కుల మొత్తం జాబితాను తయారు చేసి కంప్యూటరీకరణ కూడా పూర్తయినట్లుగా అధికారులు తెలిపారు. కాగా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అనేవి చూసి తప్పులు ఉంటే వాటిని సరిచేస్తున్నామని తెలిపారు. కాగా ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ నెల 12వ తేదీన విడుదలవుతాయని అధికారులు ఇప్పటికే తెలిపారు.

News April 6, 2025

MBNR: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందిన ఘటన నవాబుపేట మండలంలో నిన్న జరిగింది. స్థానికుల వివరాలు.. కారుకొండకి చెందిన యాదమ్మ తన కుమారుడితో కలిసి బైక్‌పై పనిమీద బయటికెళ్లి తిరిగివస్తున్నారు. షాద్‌నగర్ సమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో మహిళ తలకు తీవ్రగాయాలవటంతో అక్కడికక్కడే మృతిచెందారు.

error: Content is protected !!