News April 5, 2025
నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

HYD నిమ్స్ ఆసుపత్రిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. మిలీనియం బ్లాక్‌లో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ కార్డియాక్ ఐసీయూలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. డాక్టర్ మాలెంపాటి అమరేశ్ రావు నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. తల్లిదండ్రుల ఆధార్, రేషన్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో ఉ.10 నుంచి సా.4 వరకు పాత భవనం మొదటి అంతస్తు ఆరో వార్డులో సంప్రదించాలి.
Similar News
News April 6, 2025
‘జై శ్రీరాం’: నేడు హైదరాబాద్‌లో ఒకటే స్లోగన్

శ్రీ రామ నవమి వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది. సీతారాంబాగ్ టెంపుల్, ఆకాశ్‌పురి హనుమాన్ టెంపుల్ నుంచి భారీ శోభాయాత్రలకు సర్వం సిద్ధమైంది. హనుమాన్ టేక్డీ వద్ద ఈ యాత్ర ముగుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిటీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఇక అన్ని రామాలయాల్లో కళ్యాణానికి ముహూర్తం పెట్టారు. నేడు ‘జై శ్రీరాం’ నినాదాలతో హైదరాబాద్ హోరెత్తనుంది.
News April 6, 2025
HYD: రామనవమి శోభాయాత్ర.. ట్రాఫిక్ డైవర్షన్

శ్రీ రామనవమి శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలుంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. శోభాయాత్ర ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ వరకు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. ఈ మార్గంలో ఉన్న ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ అమలులో ఉంటుందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
News April 5, 2025
HYD: ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

HYDలో విషాదం నెలకొంది. కవాడిగూడలోని సీసీజీవో టవర్స్‌లోని 8వ అంతస్తు నుంచి కిందకు దూకి ఓ అధికారిణి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్ జయలక్ష్మిగా ఆమెను పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.