News September 11, 2025

నిమ్స్‌లో వాట్సప్‌లోనే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

image

రోజురోజుకూ పేషెంట్లు రద్దీ పెరుగుతుండటంతో రోగులు ఇబ్బంది పడకుండా మెరుగైన సేవలు కల్పించేందుకు నిమ్స్ అధికారులు సిద్ధమయ్యారు. రిజిస్ట్రేషన్ వద్ద గంటల తరబడి వేచి చూడకుండా ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి రానుంది. మరో వారం, పది రోజుల్లో వాట్సప్, ఆన్‌లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించి రోగులు వేచి ఉండకుండా చర్యలు తీసుకుంటామని నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. కియోస్క్‌లు కూడా ఉపయోగిస్తారని తెలిపారు.

Similar News

News March 30, 2026

ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. లష్కరే టెర్రరిస్టు అరెస్టు

image

ఉగ్రదాడి కుట్రను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, కేంద్ర ఏజెన్సీలు భగ్నం చేశాయి. వాంటెడ్ టెర్రరిస్టు, లష్కరే తోయిబా ఆపరేటివ్ షబ్బీర్ అహ్మద్ లోనెను ఢిల్లీ సరిహద్దుల్లో అరెస్టు చేశాయి. ఇతడు J&Kలోని శ్రీనగర్ జిల్లా కంగన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇటీవల ఢిల్లీ, సౌత్ ఇండియాలో <<19470141>>పట్టుబడిన<<>> టెర్రరిస్టులతో ఇతడికి సంబంధాలున్నాయని అధికారులు తెలిపారు.

News March 30, 2026

ఖమ్మం: ఇలా చేస్తే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్..!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సైబర్ కేటుగాళ్లు మాయమాటలతో అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. ఇతరుల ఖాతాల ద్వారా నగదు బదిలీ చేయించి, మోసాలకు పాల్పడుతున్నారు. తెలియక కమీషన్ కోసం ఆశపడి సహకరించిన వారి ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేస్తున్నారు. అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు జరపొద్దని, మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం అధికారులు హెచ్చరిస్తున్నారు.

News March 30, 2026

VKBలో భారీగా పడిపోయిన ధరలు.. బంద్ ప్రభావమా?

image

కోడిగుడ్ల ధరలు గణనీయంగా పడిపోవడం పౌల్ట్రీ రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో గుడ్డు ధర రూ.3.50- రూ.4.50 మధ్య, ఇక ట్రే గుడ్లు రూ.120- రూ.140 పడిపోవడం చిన్న వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. చికెన్ షాపుల బంద్ పిలుపు సంక్షోభాన్ని మరింత హైలైట్ చేస్తోంది. తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.