News April 25, 2025
నియమ నిబంధనలు పాటించని ఆ ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు: డీఎంహెచ్‌వో

ములుగు జిల్లాలో ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో గోపాలరావు అన్నారు. గురువారం జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో యాజమాన్యాలతో డీఎంహెచ్‌వో సమావేశం నిర్వహించారు. ప్రైవేటు ఆసుపత్రులు తాము అందించే సేవలు,తీసుకునే ఫీజుల వివరాల తో కూడిన ధరల పట్టికను ఆస్పత్రులలో ఏర్పాటు చేయాలని అన్నారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కేసులు పెడతామన్నారు.
Similar News
News April 25, 2025
తెలంగాణ సంక్షేమ పథకాలు ఆదర్శం: మంత్రి తుమ్మల

తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు దక్కాల్సిన పథకాలు అర్హులకు దక్కడం లేదని, అందుకే కులగణన జరిపామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాజ్యాంగాన్ని అనుసరించి అందరూ సమానమైన హోదాలో ఉండాలని కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 14 నెలల్లో చేసిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రం చేయలేదన్నారు.
News April 25, 2025
HYD: పచ్చటి కాపురంలో కలహాల చిచ్చు..!

పెళ్లైన కొన్నేళ్లకే ఆలుమగల మధ్య విభేదాలు పచ్చటి కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. చిన్నవాటిని పెద్దగా చూస్తూ కాపురంలో సర్దుకోలేక HYD ఉమెన్ పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. వారికి పోలీసులు కౌన్సెలింగ్ అందిస్తున్నారు. వారి మధ్య అన్యోన్యత దెబ్బతింటుందని, పెళ్లయ్యాక లావు అయ్యావని, అంతకు ముందు నువ్వు ఇలా లేవని ఒకరినొకరు దూషించుకుంటున్నట్లు ఉప్పల్ WPS పోలీసులు తెలిపారు.
News April 25, 2025
కొత్తగూడెం: డ్రింక్&డ్రైవ్‌లో 16 మందికి జరిమానా

అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 16 మందికి జరిమానా విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు గురువారం తీర్పునిచ్చారు. కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ వాహనాలను ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా వారు మద్యం తాగినట్టు రుజువైంది. దీంతో వారిని కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ ఎదుట వారు నేరం ఒప్పుకోగా జరిమానా విధించారు.