News August 19, 2025
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలి: కలెక్టర్

జిల్లాలో 10వ తరగతి విద్యార్హత ఉన్నవారు కనీసం 10 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులకు ఉల్లాస్ అక్షర ఆంధ్ర అక్షరాస్యత కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారిని అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యమన్నారు.
Similar News
News August 20, 2025
ఎంపీడీవోలు సచివాలయాలను తనిఖీ చేయాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రతి ఎంపీడీవో వారానికి 4 సచివాలయాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని ఎంపీడీవోలతో కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ప్రధాన బాధ్యత ఎంపీడీవోలదే అన్నారు. జిల్లాలో క్లాప్ మిత్రా జీతాల సమస్య పరిష్కరించాలన్నారు.
News August 19, 2025
శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనం బోల్తా.. వ్యక్తి మృతి

దోర్నాల-శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిన్నారుట్ల సమీపంలో మంగళవారం ఓ బైక్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న కొంగా సుబ్బారెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై మహేష్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరు కడప జిల్లా సిద్ధవటం మండలానికి చెందిన వారిగా గుర్తించారు.
News August 19, 2025
ఉద్యానవన పంటల సాగుపై చైతన్య పరచాలి: కలెక్టర్

జిల్లాలో ఉద్యానవన పంటల సాగుకు సంబంధిత అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. మంగళవారం ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. ఉద్యానవన పంటలకు అనుకూలమైన భూములను గుర్తించాలన్నారు. రైతులను ప్రోత్సహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.