News July 19, 2024
నిరుద్యోగులకు ప్రభుత్వం GOOD NEWS

TG: త్వరలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ‘ఓవర్ ల్యాపింగ్ లేకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తాం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం త్వరలో ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఇందులో ఉ.10 నుంచి సా.5 వరకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఇస్తాం. ఇప్పటికే నిపుణులను ఎంపిక చేశాం’ అని భట్టి వివరించారు.
Similar News
News February 18, 2026
YouTube డౌన్

ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. మొబైల్, డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదు. యాక్సెస్ చేయాలని చూస్తుండగా ‘Something went wrong’ అని చూపిస్తోంది. దీంతో యూజర్లు సోషల్ మీడియాలో యూట్యూబ్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. మీకూ ఇలాగే అవుతోందా? మరోవైపు అంతరాయంపై పేరెంట్ కంపెనీ గూగుల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
News February 18, 2026
మార్చి 15లోపు పరిషత్ ఎన్నికలు నిర్వహించకుంటే…

TG: పరిషత్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో చిక్కొచ్చి పడింది. మార్చి 15లోపు ఎలక్షన్స్ నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు మురిగిపోనున్నాయి. అంతకుముందు నిర్వహిద్దామంటే టెన్త్ ప్రీఫైనల్స్, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంతో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సర్కార్ తర్జనభర్జన పడుతోంది. ఈ నెల 23న జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయానికి రానుంది.
News February 18, 2026
25,487పోస్టులు.. పరీక్ష వాయిదా

CAPFS, SSF, అస్సాం రైఫిల్స్‌లో ఖాళీగా ఉన్న 25, 487 కానిస్టేబుల్ (<


