News November 18, 2025
నిరుద్యోగుల ఆశలకు చిరునామాగా సింగరేణి మెగా జాబ్ మేళా

నిరుద్యోగుల ఆశలకు చిరునామాగా సింగరేణి మెగా జాబ్ మేళాలు నిలుస్తున్నాయి. సింగరేణి ప్రాంత యువతీ, యువకుల కోసం హైదరాబాద్‌కు చెందిన పలు ప్రైవేట్ కంపెనీల సహకారంతో సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా పెట్టి వేలాది యువతకు కొత్త అవకాశాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన జాబ్ మేళాలో 3500 మంది అభ్యర్థులు పాల్గొనగా.. 2,000 మందికి ఉపాధి లభించింది.
Similar News
News November 18, 2025
BIG ALERT: మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందంటూ వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్నారు. SBI లోగోను డీపీగా పెట్టుకుని APK ఫైల్స్‌ను పంపుతున్నారు. దీన్ని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే SBI అలాంటి ఫైల్స్‌ను ఎప్పుడూ పంపదని, వాటిని క్లిక్ చేయొద్దని PIB Fact Check స్పష్టం చేసింది.
#ShareIt

ధర్వేశిపురం ఎల్లమ్మకు మంగళవారం ప్రత్యేక పూజలు

కనగల్ మండలం ధర్వేశిపురంలో వెలసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధాన పూజారి మల్లాచారి ఆధ్వర్యంలో పంచామృతాభిషేకాలు, కుంకుమ పూజలు, మంగళహారతులు నిర్వహించారు. భజన బృందం ఆలాపనతో ఆలయ ప్రాంగణమంతా భక్తి వాతావరణం నెలకొంది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.