News October 4, 2025

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమం: మంత్రి సుభాష్

image

రామచంద్రపురం నియోజకవర్గ నిరుద్యోగ యువకులకు BS6, BS7 బైక్ రిపేర్‌పై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ నుంచి ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వసతి గృహం వద్ద 30 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. నూరు శాతం హాజరు కలిగిన అభ్యర్థులకు అధునాతన టూల్‌కిట్‌ అందజేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Similar News

News October 5, 2025

MDK: బైక్‌ దొంగకు నిప్పు.. ఒకరి పరిస్థితి విషమం

image

మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో బైక్‌ దొంగిలిస్తున్న యేవాన్, మహిపాల్‌లను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఆగ్రహంతో వారి జేబులోని పెట్రోల్‌తో ఒకరిపై నిప్పంటించారు. మంటలు ఆర్పిన పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యేవాన్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, మరొ దొంగ మహిపాల్‌పై ఇది వరకు పోక్సో కేసు ఉందని పోలీసులు తెలిపారు.

News October 5, 2025

నిజాసాగర్ 6గేట్ల నుంచి 51,761 క్యూసెక్కులు విడుదల

image

నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. శనివారం సాయంత్రం 51,761 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 6 వరద గేట్లను ఎత్తి 51,762 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.687 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.

News October 5, 2025

ఆలస్యం చేస్తే ఊరుకోను.. ట్రంప్ వార్నింగ్

image

తన ప్రకటనపై హమాస్ వేగంగా స్పందించాలని అమెరికా అధ్యక్షుడు <<17906657>>ట్రంప్ హెచ్చరించారు<<>>. ‘బందీలను విడుదల చేసేందుకు, శాంతి ఒప్పందాన్ని అమలు చేసేందుకు తాత్కాలికంగా బాంబింగ్ ఆపినందుకు ఇజ్రాయెల్‌ను అభినందిస్తున్నా. హమాస్ వైపు నుంచి ఏదైతే జరుగుతుందని అందరూ భావిస్తున్నారో అలాంటి ఆలస్యాన్ని నేను సహించను. బందీలను విడుదల చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి. అందరితో న్యాయంగా వ్యవహరిస్తాం’ అని SMలో పోస్ట్ చేశారు.