News April 28, 2024

నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం: లోకేశ్

image

జగన్ రెడ్డి తనకు తగిలిన గులకరాయి గాయంపై బ్యాండేజ్ తీసేస్తే ఎలాంటి మచ్చాలేదని, దీంతో ఆయన నటన ప్రజలకు అర్థమైందని నారా లోకేశ్ పేర్కొన్నారు. శనివారం రాత్రి మంగళగిరి పట్టణం ఇందిరానగర్‌లో నిర్వహించిన రచ్చబండ సభలో లోకేశ్ మాట్లాడుతూ.. ఇందిరా నగర్‌లో నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. స్టేడియం పనులు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపడతామని తెలిపారు.

Similar News

News November 12, 2025

GNT: జిల్లాలో అదనంగా 264 పోలింగ్ కేంద్రాలు

image

గుంటూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ద్వారా అదనంగా 264 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్‌కే ఖాజావలి తెలిపారు. కలెక్టరేట్ వీసీ హాలులో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అదనంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

News November 12, 2025

న్యూమోనియా రహిత సమాజ నిర్మాణం లక్ష్యం: కలెక్టర్

image

న్యూమోనియా వ్యాధి రహిత సమాజ నిర్మాణం లక్ష్యమని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. న్యూమోనియా వ్యాధిపై అవగాహన పోస్టర్లను బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమె విడుదల చేశారు. ప్రతీ సంవత్సరం నవంబర్ 12వ తేదిన ప్రపంచ న్యూమోనియా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఊపిరితిత్తులలో అసాధారణ ద్రవం చేరడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిని కల్గించే పరిస్థితిని న్యూమోనియా అన్నారు.

News November 12, 2025

గుంటూరు రైల్వే, బస్టాండ్‌లలో భద్రతా తనిఖీలు

image

ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అదనపు ఎస్పీ హనుమంతు ఆధ్వర్యంలో జిల్లా భద్రతా విభాగం పోలీసులు రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బీడీ టీములు, జాగిల బృందాలు ప్రయాణికుల సామానును, కౌంటర్లను క్షుణ్ణంగా పరిశీలించాయి. అనుమానిత వస్తువులు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.