News April 13, 2025

నిరుపేదల భూముల క్రమబద్దీకరణ చట్టం వరం: జేసీ

image

నిరుపేదల భూముల క్రమబద్దీకరణ చట్టం ఒక వరంగా మారిందని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అన్నారు.  ప్రజలు ఎదుర్కొంటున్న భూ వివాదాలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. భూ సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Similar News

News July 7, 2025

ఖమ్మం జిల్లా నేటి వార్త సమాచారం

image

☆ బోనకల్, వైరా మండలాల్లో నేడు విద్యుత్ నిలిపివేత
☆ వేంసూర్లో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
☆ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం
☆ నేడు జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు
☆ కారేపల్లిలో నేడు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
☆ ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దివాస్ కార్యక్రమం
☆ జిల్లాలో నేడు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ల పర్యటన
☆ వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు

News July 7, 2025

కడప జిల్లా ప్రజలకు గమనిక

image

కడప కలెక్టరేట్‌లో ఇవాళ గ్రీవెన్స్ డే జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సభా భవనంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అంతకంటే ముందు ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ ప్రోగ్రాం నిర్వహిస్తారు. ప్రజలు 08562-244437కు కాల్ చేసి తమ సమస్యలను చెప్పవచ్చు. అలాగే మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు కోరారు.

News July 7, 2025

పెద్దపల్లి యువతకు ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ అవకాశం

image

పెద్దపల్లిలో జిల్లాలో ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు ప్రారంభించనున్నట్లు మహిళా, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ తెలిపింది.. ఈ కోర్సులకు జ్యోతినగర్, NTPC, GDKలో ఈ శిక్షణ ఇస్తారు. INTER పాసైన యువత దీనికి అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 8లోపు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం, గది నం.114లో దరఖాస్తు చేయాలి. మరిన్ని వివరాలకు https://peddapalli.telangana.gov.in చూడవచ్చు