News March 26, 2025

నిర్ణీత గడువు లోపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అధికారులను ఆదేశించారు. మంగళవారం పాత ఆజంజాహీ మిల్ గ్రౌండ్లో 16.7 ఎకరాలలో రూ.80 కోట్లతో నిర్మిస్తున్న జీ ప్లస్ టూ కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు బ్లూ ప్రింట్ మ్యాప్ ప్రకారం పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 29, 2025

మే 23 నుంచి వారం పాటు 30 రైళ్లు రద్దు

image

సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని మహబూబాబాద్ స్టేషన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నందున మే 23 నుంచి 29 వరకు సుమారు 30 రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితో పాటు మరో ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు CPRO శ్రీధర్ తెలిపారు. అలాగే 35 రైళ్లకు ఆయా తేదీల్లో మహబూబాబాద్ స్టేషన్లో స్టాపేజీని ఎత్తివేశామని వెల్లడించారు.

News March 29, 2025

WGL: యువతి దూరం పెడుతోందని యువకుడి ఆత్మహత్య

image

ప్రేమించిన అమ్మాయి దూరం పెడుతోందని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. WGL జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన సాయి(25) కొంతకాలంగా HYDలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఓ యువతిని సాయి ప్రేమించగా.. ఇరు కుటుంబాలు అంగీకరించాయి. కొంతకాలంగా ఆ అమ్మాయి దూరం పెడుతుండటంతో అతడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు చెప్పారు.

News March 29, 2025

వరంగల్: సైనిక్ స్కూల్ విద్యార్థులకు అగ్నివీర్ ఉద్యోగాలు

image

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని సైనిక్ స్కూల్‌కు చెందిన 8 మంది డిగ్రీ విద్యార్థులు అగ్నివీర్(ఇండియన్ ఆర్మీ)లో ఉద్యోగాలు సాధించారు. పాఠశాలకు చెందిన ఈశ్వర్, ఆకాష్, అంజి, ఆనంద్, సాయికుమార్, రాజేందర్, అభిలాష్, శ్రావణ్ ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 8 మంది విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్ అభినందించారు.

error: Content is protected !!