News March 28, 2025
నిర్మలా సీతారామన్‌ను కలిసిన మంత్రి సత్య కుమార్

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ జాతీయ ఆరోగ్య మిషన్, ఇతర పథకాల కింద రాష్ట్రానికి అదనంగా రూ.259 కోట్లు కేటాయించాలని కోరారు. NHM రాష్ట్రానికి రూ.109 కోట్లు, పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కింద రాష్ట్రానికి మరో రూ.150 కోట్లు విడుదల చేయాలని కోరారు.
Similar News
News December 5, 2025
WNP: గ్రామపంచాయతీలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు

పోలింగ్ సిబ్బందికి 2వ విడత ర్యాండమైసేషన్ ప్రక్రియను చేపట్టినట్లు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎన్నికల పరిశీలకులు మల్లయ్య బట్టు, వ్యయ పరిశీలకులు శ్రీనివాసులు అన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ తొలివిడత ఎన్నికలు జరిగే అయిదు మండలాలకు సంబందించి టీములను కేటాయించారు. పోలింగ్ జరిగే 5 మండలాలలోని 87 గ్రామ పంచాయతీలకు సిబ్బందిని కేటాయించడం జరిగిందన్నారు.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
వనపర్తి: సర్పంచ్ అభ్యర్థులుగా 177 మంది నామినేషన్లు దాఖలు..!

వనపర్తి జిల్లాలో మూడో విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీలకు గురువారం మొత్తం 177 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ చిన్నంబావి – 27 నామినేషన్లు.
✓ పానగల్ – 50 నామినేషన్లు.
✓ పెబ్బేరు – 41 నామినేషన్లు.
✓ శ్రీరంగాపూర్ – 19 నామినేషన్లు.
✓ వీపనగండ్ల – 40 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఇప్పటివరకు మొత్తం సర్పంచ్‌ల నామినేషన్లు 222కు చేరింది.


