News December 28, 2025
నిర్మలా సీతారామన్‌పై మంత్రి పయ్యావుల ప్రశంసలు

కోవిడ్ సంక్షోభంలో దేశాన్ని ఆర్థికంగా ఆదుకోవడంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో కష్టపడ్డారని మంత్రి పయ్యావుల కేశవ్ కొనియాడారు. ఆదివారం పీఎం లంకలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కూటమికి ప్రజలు వేసిన ఓటు వల్లే అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు వస్తున్నాయని తెలిపారు. గతంలో రక్షణ శాఖ, ప్రస్తుత్తం ఆర్థిక శాఖల బాధ్యతలను నిర్మలమ్మ సమర్థంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.
Similar News
News December 31, 2025
పాలకోడేరు: పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్

కుముదువల్లి పంచాయతీ చినపేటలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేశారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కలెక్టర్ కుమారుడు చదలవాడ భరత్ వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.
News December 31, 2025
సంక్రాంతి సందడి.. పశ్చిమలో హోటళ్లు హౌస్‌ఫుల్!

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగకు ప.గో జిల్లాకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలి వస్తుంటారు. పండుగ నాలుగు రోజులు జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఉండటానికి హోటళ్లు, లాడ్జిలు ముందుగానే బుక్ చేసుకున్నారు. దాదాపు ఆరు నెలల ముందుగానే బుక్ చేసుకోవడంతో పండుగ సమయంలో హోటల్ రూమ్‌లు దొరకడంలేదు. నాలుగు రోజుల్లో రూ.కోటికి పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
News December 31, 2025
జిల్లా వ్యాప్తంగా బుధవారం పెన్షన్ పంపిణీ: కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ప్రభుత్వ ఆదేశాలతో ఒక్కరోజు ముందుగానే బుధవారం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ చదవాల నాగరాణి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2,24,521 మంది లబ్ధిదారులకు రూ.97.19 కోట్లను సచివాలయ సిబ్బంది నేరుగా అందజేస్తారని పేర్కొన్నారు. జనవరి 1న సెలవు కావడంతో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఉదయం నుంచే పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె వివరించారు.


