News February 16, 2026

నిర్మల్‌లో రికార్డ్.. భార్యాభర్తలే ఛైర్మన్, వైస్ ఛైర్మన్

image

నిర్మల్ మున్సిపాలిటీ రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఛైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య, వైస్‌ ఛైర్మన్‌గా ఆమె భర్త అప్పాల గణేష్ చక్రవర్తి సోమవారం ప్రమాణం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు మున్సిపల్ కీలక పదవులను దక్కించుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ బలపరిచిన ఈ జంట ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Similar News

News March 5, 2026

భద్రాద్రి: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

image

భద్రాద్రి జిల్లా నూతన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్‌ను జిల్లా కోర్టు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినందుకు జడ్జి వసంత్ పాటిల్.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌కు సూచించారు.

News March 5, 2026

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాజమండ్రికి తరలింపు

image

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(PPA) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ పర్యవేక్షణను సమర్దవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వేగవంతమైన పర్యవేక్షణ, కార్యాలయం దగ్గరగా ఉండటం వల్ల పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించడం సులభమవుతుంది. ముంపు సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లవచ్చు.

News March 5, 2026

సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్!

image

అస్సాంలో సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానం గల్లంతయింది. జోర్హాట్ నుంచి టేకాఫ్ అయిన జెట్ 7.42PM సమయంలో రాడార్ నుంచి కాంటాక్ట్ కోల్పోయింది. పైలట్ కూడా మిస్ అయినట్లు రక్షణ శాఖ అధికారులు చెప్పారు. IAF సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. అయితే ఫైటర్ జెట్ కూలిపోయిందని వార్తలు వస్తున్నాయి.