News April 19, 2025

నిర్మల్‌లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత

image

నిర్మల్ జిల్లాలో శనివారం 42.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఓవైపు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోవైపు అనుకోని అకాల వర్షాలు కురుస్తున్నాయన్నారు. జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం 42.5, సోమవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News December 21, 2025

ATP: నీటి కుంటలో పడి బాలుడి మృతి

image

పెద్దవడుగూరు మండలం రావులుడికి చెందిన కమలేశ్వర్ రెడ్డి (8) ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో కమలేశ్వర్ రెడ్డి తల్లిదండ్రులతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. గ్రామ శివారులోని కుంటలోకి ప్రమాదవశాత్తు జారి పడి ఊపిరాడక మృతి చెందాడు. బాలుడు మృతి చెందడంతో రావులుడికిలో విషాదఛాయలు అలముకున్నాయి.

News December 21, 2025

బాపట్ల: కూలి పనులకెళ్లి యువకుడి మృతి

image

నల్గొండలోని చిట్యాల శివారు ఉరుమడ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పురిమిట్ల అక్షయ్(26) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకొల్లు నుంచి మునుగోడుకు వెళ్లిన అక్షయ్, తన భార్యతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా వాహనం అదుపుతప్పింది. సమాచారం అందుకున్న ఎస్సై మామిడి రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News December 21, 2025

జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు ప్రారంభం

image

ధర్మవరం ఆర్డీటీ మైదానంలో ఆదివారం ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో ఇంఛార్జ్ హరీష్ బాబు పోటీలు ప్రారంభించారు. క్రీడల్లో గెలుపోటములు సమానంగా స్వీకరించాలని, క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ధర్మవరం ఉపాధ్యాయులు జట్టు రాష్ట్రస్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి పాల్గొన్నారు.